దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.
జైలులో తనకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ఆదేశాల మేరకే తనకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా తన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తక్షణమే హెల్త్ చెకప్ చేయాలనే డిమాండ్ కూడా ఆయన లేవనెత్తారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్, ఆప్ నేతలకు భంగపాటు ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది.
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.
ఈసారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు
సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.