టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్ వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్‌గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్ రాడార్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..…
మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది.
Tamilnadu-IT Raids: కోలీవుడ్ టార్గెట్ గా ఐటీ శాఖ ఇటీవల తమిళనాడు వ్యాప్తంగా దాడులు చేసింది. ఏక కాలంలో 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్టు 2న నిర్వహించిన సోదాల్లో లెక్కలోకి రాని లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. సోదాల సమయంలో పలు రహస్య ప్రాంతాలను గుర్తించింది. ఈ విషయాన్ని శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో అనూహ్యంగా డోలో 650 టాబెట్ల అమ్మకాలు పెరిగిపోయాయి.. ప్రపంచ వ్యాప్తంగా డోలో పేరు మార్మోగిపోయింది.. డోలో 650 వేసుకుంటే చాలు.. కరోనా నుంచి తప్పించుకోవచ్చన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ మాత్రలను కొనుగోలు చేశారు.. భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ డోలోకు డిమాండ్ పెరిగింది.. మైక్రో ల్యాబ్స్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు సైతం తరలివెళ్లాయి డోలో 650 టాబెట్లు.. అయితే, డోలోను తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ పై…
పల్నాడు జిల్లా నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ, ఐబీ సోదాలు ముగిసాయి. అకాడమీ లోని కంప్యూటర్ లలో సమాచారాన్ని హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసుల అదుపులోనే ఆవుల సుబ్బారావు వున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వందలమంది విద్యార్థులను పంపినట్టు గుర్తించారు. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది…
ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…