Jagadish Reddy : ఐటీ దాడులపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ విషయంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నా పీఏ పై కాదు ఐటి దాడులు జరిగింది….నా అనుచరుడిపై అని వివరణ ఇచ్చారు. ఈటల రాజేందర్ ప్రభుత్వంపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని స్వయంగా ఈటల రాజేందర్ చెప్పారన్నారు. కౌరవుల పక్కన ఉండి- ధర్మయుద్ధం గురించి ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని, ఈటల రాజేందర్ ధర్మం, భాష గురించి మాట్లాడి సానుభూతి పొందాలంటే సాధ్యం కాదని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, హైదరాబాద్ నుంచి వచ్చిన గుండాలు పలివెల గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Petrol and Diesel Prices: ఎన్నికల ముందు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈటల రాజేందర్ కంటే ముందు నుంచే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమ బిడ్డ జగదీశ్వర్ పై దాడి చేశారన్నారు. గోడవను ఆపేందుకు ప్రయత్నించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారని, పరివేలి గ్రామంలో బీజేపీకి మెజారిటీ రాదని స్పష్టంగా తెలిసిపోయిందని, హింసను కేసీఆర్ ఎప్పుడూ ఇష్టపడరని అందరికీ తెలుసునన్నారు. ప్రజలు లేకపోవడం వల్లనే బీజేపీ సభలను రద్దు చేసుకుందని, బీజేపీలో పెద్ద నాయకులే భయపడుతున్నారు…ఏ క్షణంలో మాయమైపోతానోనని! అంటూ ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్నంత స్వేచ్చాయుత వాతావరణం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్న మంత్రి జగదీష్.. నాపై నిషేధం పెట్టినా…సానుభూతి కోసం నేను ప్రయత్నం చేయలేదన్నారు. ఎవరు ఐటీ దాడులకు పురికొల్పుతోందో ప్రజలు గమనిస్తున్నారని, మా పోలీసులు ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుల ఇళ్లలో సోదాలు చేయలేదని, బైక్స్ పై ఉన్న టీఆర్‌ఎస్ కార్యకర్తలపై సడన్ గా బీజేపీ వాళ్ళు దాడి చేశారని, గతంలో బెంగాల్ లో ఇలానే దాడులు చేస్తే…ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!