Big News : కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటి సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ)శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు కరీంనగర్, హైదరాబాదులో కొనసాగుతున్నాయి. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ 30 టీమ్స్‌తో సోదాలు చేస్తోంది. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని బీజేపీ నేత పేరాల శేఖర్ రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ విదేశాలకు ఎగుమతి జరిగింది. 2011లో కాకినాడ పోర్టులో అధికారులు సోదాలు నిర్వహించారు.
Also Read : Best Food in Winter : చలికాలంలో తినాల్సిన ఆహారం.. వాటిని అస్సలు తీసుకోవద్దు..
అయితే.. ఆ సోదాల్లో అక్రమంగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. అయితే.. అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు భారీగా జరిమానాలు సైతం విధించారు. అప్పట్లో మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు బీజేపీ నేత శేఖర్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అయితే అప్పట్లో.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, ఎగుమతులపై కేంద్ర విచారణ సంస్థలు, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. అయితే.. ఇప్పుడు తాజాగా కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!