IT raids: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. పలు షాపింగ్ మాల్స్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులోని హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్‌తో సహా 10 చోట్ల ఐటీ అధికారులు పలు రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే యాజమానుల ఇళ్లల్లో కూడా సోదాలు జరుపుతున్నారు.
పలు రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు కొన్ని కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పలు షెల్ కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. అందులో భాగంగా ఐటీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సంస్థలపై ఒకసారి దాడులు నిర్వహించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు మళ్లీ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఆర్ఎస్ బ్రదర్స్‌లో కూడా ఐటీ అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని కీలక ప్రాంతాల్లో అనూహ్యంగా ఒకేసారి ఐటీ దాడులు చేపట్టడం ప్రకంపనలు రేపుతోంది.
Read Also: YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
ఇటీవల కాలంలో ఆర్ ఎస్ బ్రదర్స్ యాజమాన్యం హానర్స్ రియల్ ఇన్ ఫ్రా పేరుతో వాసవి, సుమధురతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా హానర్స్ జోక్యం చేసుకుంది.
ఈ క్రమంలో హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వాసవి, సుమధురతో కలిసి ఆర్‌ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తోంది. దీంతో ఐటీ అధికారుల కన్ను షాపింగ్ మాల్స్ మీద పడ్డాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లోని పలు షాపింగ్ మాల్స్ లో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఎకౌంట్స్ లావాదేవీలు..హార్డ్ డిస్క్ లను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ, సీబీఐ సోదాలు సంచలనం రేపాయి. పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అవి అలా ఉండగానే ఇప్పడు ఐటీ రంగంలోకి దిగడం నగరంలో సంచలనం రేపుతోంది.