Rajastan: మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించి ఆయన శాసనసభ నియోజకవర్గం కోట్‌పుట్లీలో యాదవ్ బంధువులు నడుపుతున్న బ్యాగ్‌ల తయారీ కర్మాగారంపై కూడా దాడి జరిగింది. ఐటీ శాఖకు చెందిన చాలామంది అధికారులు, పోలీసు సిబ్బంది, దాదాపు ఆరుకు పైగా వాహనాల్లో ఫ్యాక్టరీకి చేరుకుని సోదాలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Nitish Kumar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో బిహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ.. 2024 ఎన్నికలే లక్ష్యం!
“ఈరోజు ఉదయం 8 గంటలకు ఐటీ శాఖ అధికారులు నా ప్రాంగణానికి వచ్చారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, గురుగ్రామ్‌లలో నా పిల్లలు, కుటుంబం వ్యాపారం చేసే ప్రాంతాలపై కూడా వారు దాడులు చేశారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది, త్వరలో ప్రతిదీ క్లియర్ అవుతుంది” అని రాజేంద్ర యాదవ్ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కిచ్చాలోని మంత్రి పిండి మిల్లు, నివాసంపై కూడా దాడులు జరిగాయి. రాజేంద్ర సింగ్ యాదవ్ రాజస్థాన్ శాసనసభ సభ్యుడు, రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం కుంభకోణంలో మంత్రి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు.