ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం.
హైదరాబాద్ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఐటీ సోదాలు ముగిసాయి. ఐదు రోజుల పాటు ఐటి సోదాలు కొనసాగాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ల నుండి అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలోనే కాదు… ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి.. మొన్నటికిమొన్న అక్కినేని ఉమెన్ హాస్పిటల్, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రుల్లో ఈ దాడులు కొనసాగిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు విజయవాడలో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి.. ఇవాళ ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. మొత్తం ఐదు బృందాల అధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.. వైఎస్సార్‌సీపీ నేత అయిన దేవినేని అవినాష్.. విజయవాడ తూర్పు…
మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.