తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్స్’ నిర్మాత జేవియర్ బ్రిటో ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. చైనా మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించి జేవియర్ బ్రిటోకు చెందిన ఆదంబాక్కం ఇల్లు, అడయార్ కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొబైల్ కంపెనీతో జేవియర్ బ్రిట్టో ఎగుమతి, దిగుమతి సంబంధాలే ఈ ఐటీ సోదాలు ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. ఇంతకుముందు ‘మాస్టర్’…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల నుంచి ఐటీ అధికారుల టీమ్ విశాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో ప్రముఖ బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది…
గత కొన్ని రోజులుగా హెటిరోపై ఐటీశాఖ చేస్తున్న దాడులతో… దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయల నోట్లకట్టలు.. చూసి షాకవడం అధికారుల వంతైంది. హెటిరో సంస్థల్లో దొరికిన డబ్బును లెక్కపెట్టడానికే ఐటీ అధికారులకు రెండ్రోజులు పట్టిందంటే దోపిడీ ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. డబ్బునంతా అట్టపెట్టలు, ఇనుప బీర్వాల్లో దాచిపెట్టారని చెబుతున్నారు ఐటీ అధికారులు. కేవలం డబ్బును దాచిపెట్టడం కోసమే హెటిరో సంస్థ… కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిందంటేనే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దొరికిన డబ్బులో…
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో రూ. 142 కోట్ల నగదు సీజ్ అయింది. అలాగే… రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు అధికారులు. 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్ధల్లో ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారని.. బీరువాల్లో రూ. 500 నోట్ల కట్టలేనని ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను సీజ్ చేసిన అధికారులు.. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో…
హెటిరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయట పడడంతో అధికారులే నోరు వెల్లబెడుతున్నారు.. ఐటీ దాడులులో అక్రమాలు వెలుగు చూడడంతో పాట గుట్టల కొద్ద డబ్బులు దర్శనమిస్తున్నాయి.. మూడు రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతుండగా.. రెండో రోజే రూ.100 కోట్లకు పైగా నగదు సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి.. కానీ, ఇవాళ ఆ మొత్తం ఏకంగా రూ.200 కోట్లకు చేరినట్టుగా తెలుస్తోంది.. మూడ్రోజులుగా హెటిరో డ్రగ్స్‌లో ఐటీ…
బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేశారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సన్నిహితుడు…
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు బయటపడింది.. ఇవాళ హెటిరో డ్రగ్స్ సీఈవో, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.. తొలిరోజు సోదాలు ముగిసిన తర్వాత సీఈవో, డైరెక్టర్ ఇళ్లతో పాటు కార్పొరేట్ ఆఫీస్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. దాదాపు రూ. 100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుండగా.. ఎంత నగదు అనేదానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. అయితే, సోదాలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నగదు ఎంత…
హెటిరో ఫార్మా సంస్థలపై అదాయపు పన్ను శాఖ దాడులు…రెండో రోజు కొనసాగుతున్నాయ్. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో కంపెనీ లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్లు జొన్నల సంబిరెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథిరెడ్డితో పాటు భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంలోనూ…ఐటీ అధికారులు తనిఖీలు…
గత వారం బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూడు రోజుల దాడుల తరువాత ఐటి శాఖ సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, అతని ఫౌండేషన్‌కు సంబంధించి 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు కోసం ఖర్చు చేశారని ప్రకటించారు. ఈ విషయం ఆయన ఫాలోవర్స్ ను, అభిమానులను షాక్ కు…
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సోనూసుద్ సినీ నటుడుగానో.. విలన్ గానో.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో మాత్రమే తెలుసు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనాను అరికట్టేందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా లాక్డౌన్ విధించారు. ఇది మంచి నిర్ణయమే అయినా ఆ సమయంలో కొందరి పాలిటశాపంగా మారింది. ముఖ్యంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో సోనూసూద్ వారికి అండగా నిలిచాడు. ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి వాళ్లను తమ సొంత…