Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు.
Google, Amazon layoffs: ప్రపంచంలోనే పేరుమోసిన దిగ్గజ కంపెనీలు సైతం గత కొన్ని రోజులుగా ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నాయి.. ఏ టెక్ సంస్థ దీనికి మినహాయింపు కాదు.. కొన్ని నెలల కాలంలోనే లక్షలాది మంది టెక్కీలు పింక్ స్లిప్స్ అందుకున్నారు.. తమ గోడును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. గూగుల్, అమెజాన్, మెటా ఇలా దాదాపు 570 టెక్ కంపెనీలు ఈ ఏడాది అంటే.. కేవలం మూడు నెలల కాలంలోనే 1.60 లక్షల మంది కంటే…
ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్.. మంచి జీతం, కొత్త ఇల్లు.. ఏదైనా కొనగలిగే సమర్థత.. వాయిదాల పద్ధతి కూడా ఉండడంతో.. ఏ వస్తువునైనా కొనేసే ఆర్థికస్తోమత.. అయితే, ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులుగా మారిపోయింది… ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల హెచ్చరికలతో చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించాయి..…
IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది.
Infosys: ఐటీ కంపెనీలకు సంబంధించి ఇటీవల మూన్ లైటింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. మూన్ లైటింగ్ అంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో కూడా పనిచేస్తుండటం. మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇటీవల టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సీరియస్ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాయి. తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ తన ఉద్యోగులకు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగులు కావాలనుకుంటే గిగ్…
IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ…
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..…
కరోనా పుణ్యమా అని వరుసగా మూడో ఏడాది కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేయనున్నట్లు ఐటీ ఉద్యోగులకు సమాచారం అందాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని టాప్ ఎంఎన్‌సీ కంపెనీలు అధికారికంగా…
కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించిన ఐటీ కంపెనీలు…. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని సూచిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్ త్వరలో ముగియనుండడంతో.. వెనక్కు రప్పించే కసరత్తు ముమ్మరం చేశాయి. కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా…