AI- Jobs Loss: సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంతో విఫ్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఏఐతో సాఫ్ట్ వేర్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ రాకతో సాఫ్ట్ వేర్ కొంత పుంతలు తొక్కడమే కాదు.. కొత్తగా ఉద్యోగాలను పీకేయడం కూడా చేస్తుందని టెక్కిలు ఆందోళన చెందుతున్నారు. ఏఐతో చివరికి మీడియా రంగంలో మనిషి లేకుండానే వార్తలు చదివించే పరిస్థితి ఏర్పడుతోంది. ఏఐతో సాధారణ మనుషులతోపాటు.. సెలబ్రెటీలను కూడా వారు ఏ రూపంలో ఉండాలో.. ఏ రూపంలో ఎలా ఉంటారో స్పష్టంగా చూపుతోంది ఏఐ. అయితే ఏఐతో ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉందంటున్నారు కొందరు. సాఫ్ వేర్ ఉద్యోగుల్లో జీనియస్ కన్సల్టెంట్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఎక్కువ మంది ఉద్యోగులు ఏఐతో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనలో ఉన్నారని సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
Read also: Skull Found: మానవులకు భిన్నంగా చైనాలో పుర్రె.. కలవరపడుతోనున్న సైంటిస్టులు
ఏఐతో ఉద్యోగాలు పోతాయని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. కానీ మెజారిటీ ఉద్యోగుల్లో మాత్రం ఏఐ పట్ల భయాందోళనలు ఉన్నాయనేది వాస్తవం. ఏఐ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా వెల్లడయింది. ప్రధానంగా కంటెంట్ క్రియేషన్, కోడింగ్, డిజైనింగ్ రంగాల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని సర్వే ద్వారా తెలుస్తోంది. మే 15 నుంచి జూన్ 24 మధ్య తేదీల్లో భిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న 1,207 మంది ఉద్యోగులపై జీనియస్ కన్సల్టెంట్స్ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించింది. సర్వేలో ఉద్యోగాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను ఉద్యోగులు వెల్లడించారు. 50 శాతం మంది చాట్ జీపీటీ, ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ఒక వరంలా భావిస్తున్నట్టు సర్వేలో తేలింది. మరో 25 శాతం మంది మాత్రం అధికంగా వాటిపై ఆధారపడడంతో మానవ సంబంధాలు తగ్గిపోవటం, భద్రతాపరమైన ఆందోళనలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసినట్టు సర్వేలో పేర్కొన్నది.
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 47 శాతం మంది ఉద్యోగులు చాట్‌జీపీటీని వినియోగిస్తుండగా.. 44 శాతం మంది మాత్రం దీన్ని వినియోగించటం లేదట. దీనిబట్టి మెజారిటీ వ్యక్తులు చాట్‌జీపీటీని అందిపుచ్చుకుంటున్నారని సర్వేలో తేలింది. 67 శాతం మంది ఉద్యోగులు ఏఐ ద్వారా ఒకే పని రెండు సార్లు చేయకుండా.. పని భారాన్ని తగ్గిస్తాయని.. తప్పులు రాకుండా సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. 65 శాతం మంది ఏఐ రాకతో ఆశాజనకంగా ఉన్నారు. ఏఐ రాకతో కొత్త తరహా ఉద్యోగాలు పెరగటంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు చెప్పినట్టు సర్వే నివేదికలో సంస్థ ప్రకటించింది.