Karnataka: కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. ఐటీ ఉద్యోగులు ‘‘ ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత ప్రతీ ఉద్యోగి హక్కు’’ నినాదమిస్తున్నారు.
Microsoft Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత విధించింది. వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తోన్న పలు టీమ్స్ కు చెందిన వారిని తాజాగా విడుదల చేసిన జాబితాలో నుంచి తొలగించినట్లు గ్రీక్ వైర్ అనే మీడియా సంస్థ పేర్కొనింది.
ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు…
ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించి టికెట్లను కేవలం పేటియం, సంబంధిత టీం వెబ్సైట్ లో తప్పించి ఆన్లైన్లో ఎక్కడ దొరకట్లేదు. దింతో క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ టికెట్ల రూపంలో అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ మహానగరంలో జరిగే మ్యాచ్లకైతే అభిమానులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో టికెట్స్…
కొన్ని కంపెనీలు గత ఏడాది చవిచూసిన ఆర్థిక పరిస్థితులు కారణంగా చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో దాదాపు 50 వేల మంది ఉద్యోగులను నాలుగు టాప్ కంపెనీలు తొలగించే పనిలో ఉన్నాయి.. 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను…
IT Employees: ఐటీ ఉద్యోగం అంటే.. అయిదు అంకెల జీతం, హాయ్ ఫై లైఫ్. అబ్బో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. అయితే అది నాణేనికి ఒకవైపు మాత్రమే. పని ఒత్తిడి, ఎక్కువ గంటలు కూర్చోవడం, ఆహారపు అలవాట్లు నాణేనికి మరో వైపు. దీంతో వారు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఐటీ ఉద్యోగుల జీతాలు లక్షల్లో ఉంటాయి. వారి జీతం లక్షల్లో ఉంటే... వారికి వచ్చే వ్యాధులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నారు.