IT Employees: వచ్చే మూడేళ్లలో ఏకంగా 22 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ జాబులు వదులుకోనున్నారని ఓ రిపోర్ట్ వెల్లడించింది. దీన్నిబట్టి మన దేశంలోని ఐటీ-బీపీఎం రంగంలో ఉద్యోగ క్షీణత ఏ రేంజులో ఉండనుందో అర్థంచేసుకోవచ్చు. దీంతోపాటు.. 57 శాతం మంది ఐటీ నిపుణులు మళ్లీ ఈ సర్వీసుల సెక్టారులోకి రావాలనుకోవట్లేదని కూడా ఆ నివేదిక పేర్కొంది. ‘ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’ పేరుతో ఈ నివేదికను ‘‘టీమ్ లీజ్ డిజిటల్’’ అనే సంస్థ రూపొందించింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో 49 శాతంగానే ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు 2023 ఆర్థిక సంవత్సరంలో 55 శాతానికి చేరుకోనుందని అంచనా వేసింది.
క్యాండేట్ మార్కెట్లో సెంటిమెంటుకు సంబంధించి భారీ అపోహ నెలకొంది. శాలరీ పెంచితే ఉద్యోగి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని, జాబ్ శాటిసిఫ్యాక్షన్‌కి బూస్ట్ మాదిరిగా పనిచేస్తుందనుకోవటం సరికాదు. ఈ మధ్య కొన్ని సంస్థలు శాలరీలు పెంచుతున్నా ఉద్యోగ వలసలను ఆపలేకపోతున్నాయని, 2025 నాటికి 22 లక్షల మంది కొలువులకు గుడ్ బై చెబుతారని అంచనా. ‘‘ఇండియన్ ఐటీ సెక్టార్ గత దశాబ్ద కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 15.5 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. తద్వారా 227 బిలియన్ డాలర్ల టర్నోవర్‌కి చేరింది. ఫలితంగా గత ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదున్నర లక్షల మందికి ఉద్యోగాలను కల్పించింది.
ఈ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే మామూలుగైతే పదేళ్లకు పైగా టైమ్ పడుతుంది. అలాంటిది ఆ లోపే లక్ష్యం సాకారమైందంటే ఎంత శరవేగంగా సాగిందో అర్థంచేసుకోవచ్చు’’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అన్నారు. ఐటీ రంగంలో నియామకాల ప్రక్రియకు కరోనా మహమ్మారి ఆటంకం కలిగించటంతో అప్పటివరకు కొనసాగిన ఈ పాజిటివ్ ట్రెండ్ కాస్తా రివర్స్ అయింది. బిజినెస్-క్రిటికల్ ట్యాలెంట్ పీపుల్ వెళ్లిపోకుండా ఆపటం కష్టసాధ్యమైంది. దీనికితోడు కొవిడ్ తర్వాతి రెండేళ్లలో ఐటీ హైరింగ్ చైన్‌లో చాలా మార్పులు వచ్చాయి అని సునిల్ చెప్పారు.
కొత్త ఉద్యోగాల్లోకి వెళ్లేవారు శాలరీ హైక్‌తోపాటు ఇతర బెనెఫిట్స్ కూడా చూసుకుంటారు. వర్క్ మరియు లైఫ్‌కి సంబంధించి ఎంప్లాయీస్ ఫీలింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యజమానులు తమ ఇంటర్నల్ పాలసీలతోపాటు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ పట్ల సైతం పునరాలోచన చేయాల్సిన అవసరం నెలకొందని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ సునిల్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అవసరాలు, ప్రాధాన్యతలు మారాయి. ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, ఎంప్లాయ్ వ్యాల్యూ పొజిషన్ తదితర అంశాల ఆధారంగా వాళ్లు తమ కెరీర్‌ని రీ-ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కన్నా మంచిది దొరికితే దీన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. అన్నింటికీ మించి ఉద్యోగంలో సౌకర్యానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ గణాంకాలను బట్టి వెల్లడవుతోంది. సంస్థల వ్యూహాత్మక నియామక ప్రణాళికలు తమ ఉద్యోగుల కోణంలో, వాళ్ల అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. పని పట్ల విలువ, గౌరవం ఉన్నోళ్లు దొరుకుతారు. అలాంటివాళ్ల వల్లే కంపెనీ ఔట్‌పుట్ పెరుగుతుంది. దాని ద్వారా మరో పది మందికి ప్రయోజనం కలుగుతుంది.
2021లో ఐటీ సేవల రంగంలో క్షీణత వల్లే నవతరం సంస్థలు తమ వర్క్ ఫోర్సును పెంచుకుంటున్నాయి. ఇప్పుడు చేసే ఉద్యోగంలో బెటర్ కంపెన్సేషన్ మరియు బెనెఫిట్స్ లోపించటం వల్లే ట్యాలెంటెడ్ పీపుల్ కొత్త కొలువులోకి వెళ్లిపోతున్నారని స్టడీలో పాల్గొన్న దాదాపు 50 శాతం మంది అన్నారు. కెరీర్ గ్రోత్ లేకపోవటం వల్లే స్వస్తి చెబుతున్నామని 25 శాతం మంది తెలిపారు. అత్యధిక శాలరీలు తీసుకునే బెస్ట్ ఎంప్లాయీస్ స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొని అర్ధంతరంగా వెళ్లిపోతే ఆయా సంస్థలకు టర్నోవర్ పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్యాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్ పేర్కొంది.