కరోనా పుణ్యమా అని వరుసగా మూడో ఏడాది కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని రిపోర్టులు అందుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆఫీసులు ఓపెన్ చేయనున్నట్లు ఐటీ ఉద్యోగులకు సమాచారం అందాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చే విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని టాప్ ఎంఎన్‌సీ కంపెనీలు అధికారికంగా వచ్చే ఏడాది మే నెల వరకు తమ ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయిస్తామని వెల్లడించాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి.
Read Also: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. జనవరి 1 నుంచి అమల్లోకి
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒమిక్రాన్ కేసులు భారత్‌లో పెరుగుతాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ ఉద్యోగులు 2022లో కూడా ఇంటి నుంచే పనిచేయనున్నారు. దీంతో తమకు రవాణా ఖర్చులు మిగులుతాయని కొందరు ఉద్యోగులు భావిస్తుంటే… మరికొందరు తమ ఇంటి అద్దె ఖర్చులు కూడా కలిసివస్తాయని సంబరపడుతున్నారు. కాగా కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే.