ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించింది.
ISRO: భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) స్పాడెక్స్ మిషన్ ను విజయవంతం చేసి రికార్డు సృష్టించింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో తొలిసారిగా భూకక్ష్యలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారతదేశం అవతరించింది. గత ఆదివారం, స్పాడెక్స్ ఉపగ్రహాలు చెజర్, టార్గెట్ ఒకదానికొకటి దగ్గరగా చేరడం ద్వారా…
SpaDeX Docking Update: అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా స్పేడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో ఎక్స్‌లో పోస్టు చేయడం ద్వారా వెల్లడించింది. ఈ ఉపగ్రహాలను 15 మీటర్ల దూరం వరకు తీసుకువచ్చి, ఆ తర్వాత ఆ దూరాన్ని కేవలం 3 మీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, రెండు…
ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ ఎంపికయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి ఆయన ఈ నెల 14వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగం విజయవంతం అయ్యింది.. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించారు.. ఆదివారం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత ఈ రోజు రాత్రి 9 గంటల 58 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లింది.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది రాకెట్.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలకు నాంది..…
2024లో కంటే 2025లో ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు చేపడతాం అని డాక్టర్ ఎస్.సోమనాథ్ తెలిపారు. గగన్‌యాన్ టెస్ట్ ఫ్లైట్‌ను కూడా మరో 2,3 మాసాల్లో ప్రయోగిస్తామని చెప్పారు. అమెరికాకు చెందిన నిసార్ ఉపగ్రహన్ని కూడా నింగిలోకి పంపనున్నామని సోమనాథ్ పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి రాత్రి రాత్రి 10:05కి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్…
PSLV-C60 Rocket: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ (సోమవారం) 30వ తేదీన రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న కక్షలోకి ప్రోబా-3 ఉపగ్రహాన్ని…
ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో.. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.. శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు నిర్వహించాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇస్త్రో.