Chandrayaan-4: చంద్రయాన్-4 అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. భారత్ తన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 2027లో ఉండనుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మరో 7 ప్రయోగాలను ఇస్రో ప్లాన్ చేసింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు.
మౌనం వీడిన షేక్ హసీనా.. ‘బంగ్లాదేశ్ నిరసనల వెనక ఆ రెండు దేశాల హస్తం’ దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. షేక్ హసీనా..…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా తన అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రధాన మైలురాయిని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) మాడ్యూల్ నమూనాను ఆవిష్కరించింది. Also Read:Big Nude Boat: ఇక్కడ ఎవ్వరూ బట్టలు ధరించరు..! ఆడ, మగ ఎవరైన సేమ్ రూల్స్..? భారత్ 2028 నాటికి BAS మొదటి…
ISRO Satellite Images: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో గత వారంలో సంభవించిన క్లౌడ్ బ్రస్ట్ తరవాత అందుకు సంబంధించిన భయానక దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టింది. ఈ విపత్తు కారణంగా ధరాళీ గ్రామం దాదాపు పూర్తిగా నాశనం అయిందని ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో భగీరథి నది ఒడ్డున ఇళ్లతో, చిన్న తోటలతో, ఇతర నిర్మాణాలతో ఉన్న ఒక భూభాగం…
నాసా, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
NISAR: భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా తయారు చేసిన ‘ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన ‘‘’NASA ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) శాటిలైట్’’ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సాంకేతిక అద్భుతం, గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చెబతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రాణాలను కాపాడేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. 1.3 బిలియన్ డాలర్ల పైగా ఖర్చుతో భారత్, అమెరికాలు కలిసి ఈ శాటిలైట్‌ని రూపొంందించాయి. భారత్ లోని శ్రీహరికోట లాంచింగ్ సెంటర్ నుంచి ఈ…
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి పైకి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆక్సియం-4 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు 18 రోజులు ఐఎస్ఎస్ లో ఉన్న తర్వాత భూమికి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నలుగురిలో భారతదేశానికి చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత ఆయన భూమికి చేరుతారు.
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. గురువారం ఆక్సియం-4 వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ అయింది. ఐఎస్ఎస్ చేరిన తర్వాత తన అనుభవాన్ని శుభాన్షు వివరించారు. ‘‘ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉంది’’ అని అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నంబర్ 632, అంతరిక్ష కేంద్రం పిన్ పొందారు. రాబోయే రెండు వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు.
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టి శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన ఘటన సాధించారు. ఆక్సియం-4 ఐఎస్ఎస్తో డాక్ అయింది.
‘‘స్పేస్లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు.