భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు రోదసి యాత్ర ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం అంతరిక్షంలోకి వెళ్తున్నారు. రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ సృష్టించబోతున్నాడు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లాడు.
ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక రోజు వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ గగన్ యాత్రిని పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం జూన్ 10కి బదులుగా జూన్ 11కి వాయిదా పడింది. తదుపరి ప్రయోగ సమయం జూన్…
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లోని మరో ముగ్గురు సభ్యులు అంతరిక్ష ప్రయాణానికి ముందు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ సమాచారాన్ని అమెరికన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ వెల్లడించింది. సిబ్బంది ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడమే క్వారంటైన్ ఉద్దేశ్యం. ఇది అంతరిక్ష కార్యకలాపాల భద్రత, విజయాన్ని నిర్ధారించే ప్రామాణిక ప్రక్రియ. ఆక్సియం-4 మిషన్ ద్వారా వ్యోమగాములు జూన్ 8న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:41 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి డ్రాగన్…
PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
Osmania University : స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో పరిశోధన, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోసం ప్రముఖ విద్యా సంస్థలు, అంతరిక్ష పరిశోధనా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతున్నాయి. తాజాగా, ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి అనుబంధంగా ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, తదుపరి ఐదేళ్లపాటు ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్సీ, ఓయూ సంయుక్తంగా…
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. ఈయన స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) నుండి ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా మే 29న వెళ్లనున్నట్లు అధికారికంగా యాక్సియమ్ (Axiom) తెలిపింది. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఆయన మే 29న ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఇక…
ఇదిలా ఉంటే, భారత అంతరిక్ష సంస్థ ‘‘ఇస్రో‘‘ స్పై శాటిలైట్ ప్రయోగాన్ని మరింత వేగవంతం చేసింది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా వేయడానికి సాయపడే ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని స్పీడ్ అప్ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో ప్రత్యేక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఈ శాటిలైట్ ద్వారా రాత్రి, పగలు రెండు సమయాల్లో ఇమేజింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేఘాలు అడ్డుగా ఉన్నప్పటికీ స్పష్టమైన ఫోటోలను తీసే సత్తా దీనికి…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్ఎక్స్(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది.