నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమ్మీదకు బయల్దేరింది. మరికొన్ని గంటల్లో ఆమె భూమ్మీద ల్యాండ్ కాబోతుంది. ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా రానున్నారు.
SpaDeX mission: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ఘటన సాధించింది. స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీ-డాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్ష యానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమం అయినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ఉపగ్రహాలు విజయవంతంగా డీ-డాక్ చేయడాన్ని ప్రకటించారు.
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది.
Mangalyaan-2: ‘‘మంగళయాన్’’ ఇస్రో చరిత్రలో ఘన విజయంగా చెప్పొచ్చు. దేశ సైన్స్ అండ్ టెక్నాలజీలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయోగంగా భారతీయ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయింది. హాలీవుడ్ సినిమా ‘‘గ్రావిటీ’’ బడ్జెట్ కన్నా అతి తక్కువ బడ్జెట్‌తో మనం అంగారక గ్రహాన్ని చేరడాన్ని ప్రపంచ దేశాలు కొనియాడాయి.
NVS-02 NavIC: ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ఇటీవల NVS-02 శాటిలైట్‌ని ప్రయోగించింది. భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో నావిక్ కాన్‌స్టలేషన్‌లో భాగంగా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే? గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్ కింద ఎన్వీఎస్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని జనవరి 29న GSLV-Mk 2 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారత అంతరిక్ష-ఆధారిత నావిగేషన్ వ్యవస్థకు NVS-02 ఉపగ్రహం కీలకం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్)లో కీలకమైనది. అయితే ఇప్పుడు ఇస్రోకు ఎదురు దెబ్బ తగిలింది. అంతరిక్ష నౌకలోని థ్రస్టర్ లు పనిచేయకపోవడంతో NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ…
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు…
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్…
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది. Also Read: Vijayasai Reddy Resigns: రాజ్యసభ…