SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్ ఉపగ్రహాలు..
- స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ అప్డేట్.
- రెండు ఉపగ్రహాల మధ్య 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గిన దూరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpaDeX Docking Update: అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను కనబరుస్తున్నాయి. తాజాగా స్పేడెక్స్ ఉపగ్రహాలు అత్యంత సమీపానికి చేరుకున్నాయని ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో ఎక్స్‌లో పోస్టు చేయడం ద్వారా వెల్లడించింది. ఈ ఉపగ్రహాలను 15 మీటర్ల దూరం వరకు తీసుకువచ్చి, ఆ తర్వాత ఆ దూరాన్ని కేవలం 3 మీటర్లకు తగ్గించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం, రెండు ఉపగ్రహాలను సురక్షితమైన దూరానికి తీసుకువెళ్లినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఇస్రో డాకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన డేటాను విశ్లేషించనుంది.
Also Read: Jai Shankar: అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న విదేశాంగ మంత్రి
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
ఇందుకు సంబంధించిన స్పేడెక్స్ ఉపగ్రహాల ఫోటోలను కూడా ఎక్స్‌లో షేర్ చేసింది ఇస్రో. ఆదివారం తెల్లవారు జామున 3.10 గంటలకు మొదటిగా ఈ ఉపగ్రహాలను 105 మీటర్ల దగ్గరికి తీసుకువెళ్లారు. ఈ ప్రక్రియ అనంతరం ఉపగ్రహాలు డాకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. డాకింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) ఈ రెండు ఉపగ్రహాలను డిసెంబర్ 30, 2024న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
SpaDeX Docking Update:
A trial attempt to reach up to 15 m and further to 3 m is done.
Moving back spacecrafts to safe distance
The docking process will be done after analysing data further.
Stay tuned for updates.#SpaDeX #ISRO
— ISRO (@isro) January 12, 2025
డాకింగ్ ప్రక్రియ కోసం జనవరి 7, 9 తేదీల్లో అనుసంధాన ప్రయత్నాలు జరగాల్సి ఉన్నా, అనుకోని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రక్రియ మళ్లీ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉపగ్రహాలు ‘హోల్డ్’ దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, అంతరిక్షంలో డాకింగ్ ప్రక్రియలో భారత పనితనాన్ని ప్రపంచం ముందు చాటిచెప్పినట్టవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇస్రో అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మరో కీలక మైలురాయిని సాధించింది.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!