భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఇస్రో.. ఇటు కమర్షియల్ రాకెట్ ప్రయోగాలపై కూడా దృష్టిసారించింది.. ఇప్పటికే పలు దేశాలకు చెందిన ఉపగ్రహాలను.. ఇతర సంస్థలకు చెందిన ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి చేర్చి సత్తా చాటింది..
GSAT-20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార శాటిలైట్ జీశాట్-20 (జీశాట్-N2) నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకుపోయింది.
Falcon-9 Rocket: భారతదేశం తన అత్యంత అధునాతనమైన బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20ని ప్రయోగించనుంది. దీనిని GSAT N-2 అని కూడా పిలుస్తారు. వచ్చే వారం దీనిని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘‘ఫాల్కన్ 9’’ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగబోతోంది. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్‌కి చెందిన సంస్థతో ఇస్రో భాగస్వామ్యైంది.
First Analog Space Mission: ఇస్రో (ISRO) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం నాడు లేహ్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించి.. శుక్రవారం నాడు ఆ మిషన్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇస్రో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, అలాగే భూమి బయట విశ్వంలో జీవం కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. మానవ…
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో పెద్ద ప్రకటన చేశారు. ఈ పోడ్‌కాస్ట్‌లో గ్రహాంతర నాగరికతల ఉనికి గురించి చర్చించారు. విశ్వంలో గ్రహాంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారని.. వారి నాగరికతలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సోమనాథ్ చెప్పారు. ఏలియన్స్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
దానా తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు వేగంగా కదులుతోంది. డానా తుపాను ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం మధ్య గంటకు 120 కి.మీ వేగంతో చేరుకుంటుంది.
చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడానికి భారత్ సిద్ధమవుతోంది. 2029లో చంద్రయాన్-4 మిషన్ చంద్రుడిపైకి వెళ్లి అక్కడి నుంచి మట్టి నమూనాలను తీసుకువస్తుందని ఇస్రో తెలిపింది.
Mini Moon: భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే.. చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ‘‘మిని చంద్రుడు’’ కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ‘‘మిని మూన్’’ భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతోంది. "2024 PT5" అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.