ISRO: భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) స్పాడెక్స్ మిషన్ ను విజయవంతం చేసి రికార్డు సృష్టించింది. ఈ మిషన్ ద్వారా ఇస్రో తొలిసారిగా భూకక్ష్యలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారతదేశం అవతరించింది. గత ఆదివారం, స్పాడెక్స్ ఉపగ్రహాలు చెజర్, టార్గెట్ ఒకదానికొకటి దగ్గరగా చేరడం ద్వారా ఈ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
Also Read: Nalgonda Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం!
ఈ విధంగా, రెండు ఉపగ్రహాలను ముందుగా 15 మీటర్ల దూరంలో, తర్వాత 3 మీటర్ల దూరంలో నిపుణులైన ఇస్రో పరిశోధకులు విజయవంతంగా దగ్గరగా తీసుక వచ్చారు. ఇలా జనవరి 12న పూర్తి చేసారు. ఆ తర్వాత టెక్నికల్ కారణాల వల్ల వాటి దూరాన్ని మల్లి పెంచి మొత్తానికి డాకింగ్ పక్రియను విజయవంతం చేసింది ఇస్రో. ఈ ఘనత భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరొక అద్భుత విజయంగా భావించవచ్చు. ఇస్రో స్పాడెక్స్ మిషన్ భారతదేశం కృషి, విజ్ఞాన పరమైన సాధనలు ఇంకా సాంకేతిక పరిజ్ఞానం దిశగా సరికొత్త రికార్డులను సృష్టించడానికి కృషి చేస్తుందని మరోసారి నిరూపించింది.
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
— ISRO (@isro) January 16, 2025