PSLV C-59: నిన్న వాయిదా.. నేడు PSLV C-59 ప్రయోగం
- ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 ప్రయోగం..
- సాంకేతిక కారణాలతో నిన్న చివరి నిమిషంలో వాయిదా వేసిన ఇస్త్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV C-59: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం రోజు చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం విదితమే.. కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని బుధవారం రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఇస్త్రో.. శాటిలైట్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ వెంటనే కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేశారు. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రయోగానికి ముందు అన్ని విభాగాలను కంప్యూటర్ తో పరీక్షలు నిర్వహించారు.. అయితే, ఉపగ్రహంలో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించింది.. దీనిపై శాస్త్రవేత్తల సమీక్షించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రక్రియ నిలిపివేసి.. ప్రయోగాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు PSLV-C59 రాకెట్‌ను ప్రయోగించనుంది ఇస్త్రో..
Read Also: CM Chandrababu: నేడు ముంబైకి సీఎం చంద్రబాబు.. అక్కడి నుంచి నేరుగా విశాఖకు
Also Read
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
- ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.. శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. కాగా, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైన వేళ.. పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాక్షింస్తూ.. సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ బుధవారం రోజు పూజలు నిర్వహించిన విషయం విదితమే.. ఈ సందర్భంగా ఇస్రో తదుపరి ప్రాజెక్టులపై మాట్లాడుతూ.. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక, PSLV C-60 రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని.. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని.. గగన్‌యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
-
Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
-
Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నాలుగో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే..
-
Edible Oil Imports Surge: వంట నూనెల దిగుమతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు.. 24 శాతం పెరిగిన బిల్లు!
-
IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!