ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది.
Also Read: Vijayasai Reddy Resigns: రాజ్యసభ చైర్మన్‌కు సాయిరెడ్డి రాజీనామా లేఖ..
షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద శాస్త్రవేత్తలు రాకెట్‌ను ప్రయోగ వేదికకు తరలించడానికి మూడు దశల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేశారు. ఇక, శిఖర భాగంలో ఉన్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియ కూడా బాగానే ముగిసింది. ఈ ప్రయోగం ద్వారా నావిక్ వ్యవస్థకు సంబంధించిన ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
Also Read: Dil Raju: ఐటీ సోదాలు కామన్, ఆస్తుల పత్రాలు దొరకలేదు : దిల్ రాజు కీలక ప్రకటన!
నావిక్ అనేది భారతదేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది 1500 కి.మీ. వరకు భారత భూభాగం వెలుపల కూడా సరిగ్గా, వేగంగా సమాచారాన్ని అందించగలుగుతుంది. ఈ ప్రయోగంతో ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో ముఖ్యంగా నావిగేషన్, భద్రతా వ్యవస్థలకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని మరో కీలక అడుగును వేయబోతుంది, ఈ ప్రయోగం ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగంగా గుర్తింపు పొందడంతో, షార్‌లో వివిధ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.