Israel-Hezbollah: ఇజ్రాయెల్- లెబనాల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. తాజాగా, లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Hamas Chief: హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేసేందుకు యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సిన్వార్ అధికార కాంక్షతో ఉన్నాడని ఖతర్ అధికారులు చెప్పినట్లు పేర్కొనింది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడైనా భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు విరామం లేదు. అయితే అమెరికా, అరబ్ దేశాలు కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్యంలోని అన్ని రంగాలలో ఏకకాలంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, అరబ్ దేశాలు ఇరాన్‌తో బ్యాక్‌డోర్ చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది.
israel: ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని తొందరలోనే అమెరికాలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ సంస్థ లైట్ బీమ్ లేజర్ ఇంటర్సెప్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుంది. దీనిని వాషింగ్టన్ డీసీలో ప్రదర్శనకు ఉంచనున్నట్లు ప్రకటించింది.
Israel's Netanyahu: హెజ్బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ అధిపతి హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన వారం రోజుల్లోనే అతడి వారసుడిగా భావిస్తోన్న హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ చంపేసినట్లు బెంజమిన్ నెతాన్యహు ప్రకటించారు.
Israel-Hezbollah: హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన ఆఫీసు అధిపతి సోహిల్ హొసైన్ హొసైనీని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ హతమర్చినట్లు ఈరోజు (మంగళవారం) ప్రకటించింది. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం అందించిన ఖచ్చితమైన సమాచారంతో వైమానిక దళం దాడులు కొనసాగించింది.
Iran Israel War: ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కొనసాగుతున్న వివాదం ప్రమాదకర రూపం దాల్చింది. ఈ క్రమంలో నిన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై 130 క్షిపణులను ప్రయోగించింది. ప్రతీకారంగా, IDF వేగవంతమైన దాడిని ప్రారంభించింది. కేవలం ఒక గంట పాటు 100 యుద్ధ విమానాలతో 120 సైట్ లను లక్ష్యంగా చేసుకుంది. దాడికి సంబంధించి, IDF ప్రతినిధి లెబనాన్‌లో నివసిస్తున్న ప్రజలకు తదుపరి నోటీసు వచ్చే వరకు బీచ్‌లో లేదా పడవల్లో ఉండకూడదని హెచ్చరిక జారీ చేశారు.…
Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది.
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ…
Israel Army Chief: అక్టోబర్ 7న హమాస్ దాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ అంగీకరించారు. దీనిపై నేడు ఆ దేశ ఆర్మీచీఫ్ హెర్జి హలెవీ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇది సుదీర్ఘ యుద్ధం.. ఇది సైనిక సామర్థ్యాలనే కాదు.. మానసిక శక్తిని.. దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుందన్నారు.