గాజాలో పాలన కోసం ట్రంప్ శాంతి మండలిని ఏర్పాటు చేస్తున్నాన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ శాంతి మండలిలో భారత్‌తో పాటు అనేక దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఈ శాంతి మండలిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తొలుత వ్యతిరేకించారు. తాజాగా మనసు మార్చుకున్నారు.
ఇరాన్‌ను నిన్నామొన్నటి దాకా ట్రంప్ పదే పదే వార్నింగ్‌లు ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత సౌదీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా మెత్తబడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు వచ్చింది. తాజాగా ఇరాన్‌కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలియని శక్తిని చూస్తారంటూ సూచించారు.
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు.
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ఏ రేంజ్లో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా రెండు దేశాల మధ్య వార్ నడిచింది. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం చేసింది.
Israel: హమాస్‌ను తీవ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ ఇటీవల భారత్‌ను అధికారికంగా కోరింది. హమాస్- లష్కరే తోయిబా (LeT) మధ్య సంబంధాలు పెరిగిపోతున్నాయని తెలిపింది.
Congress: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం…