అయితే, పేజర్లతో హిజ్బుల్లాను చావు దెబ్బతీయడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల గూఢచార ఏజెన్సీలను ఆశ్చర్యపరిచాయి. ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ ‘‘మోసాద్’’ పనితనాన్ని కొనియాడారు. ఇంత పెద్ద డెడ్లీ ఆపరేషన్ని మోసాద్ ఎలా చేసింది.. హిజ్బుల్లా చేత పేజర్లను ఎలా కొనేలా చేసిందనే దానిపై ది వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనం నివేదించింది. హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉచ్చులో ఎలా చిక్కుకుందనే వివరాలను వెల్లడించింది.
Iran Israel War: లెబనాన్ రాజధాని బీరూట్ లోని ఫ్రెంచ్ బహుళజాతి కంపెనీ టోటల్ ఎనర్జీస్ గ్యాస్ స్టేషన్‌ను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. అందిన సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దక్షిణ శివారు బీరుట్ లోని ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ పై వైమానిక దాడి చేసింది. ఈ దాడి తర్వాత స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి…
Iran Israel War: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు చేసింది. అందిన సమాచారం మేరకు., ఆదివారం తెల్లవారుజామున గాజా మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ దాడి జరిగింది. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఒక సంవత్సరం పూర్తి చేయబోతున్న సమయంలో సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాహ్లోని అల్-అక్సా…
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్‌లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు.
Israel Hezbollah War: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయిల్ భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే రాజధాని బీరూట్‌పై వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక దక్షిణ లెబనాన్‌పై భూతల దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ బీరూట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో హతమార్చింది.
Israel: ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ దాని రాజధాని బీరూట్‌పై భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని గత వారం బీరూట్‌లో వైమానిక దాడి చేసి హతం చేసింది.
India map: భారతదేశ మ్యాప్‌ని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం తప్పుగా చూపిండటంతో విమర్శలు ఎదుర్కొంది. పలువురు నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పుడూ ఇజ్రాయిల్‌తో నిలుస్తుంది, ఇజ్రాయిల్ భారత్‌తో ఉందా..? అని పలువురు ప్రశ్నించారు. పొరపాటుని గమనించిన రాయబార కార్యాలయం వెంటనే తప్పుగా చూపించిన మ్యాప్‌ని వెబ్సైట్ నుంచి తొలగించింది.
Hassan Nasrallah: ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడిని ముమ్మరం చేసింది. లెబనాన్ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. సెప్టెంబర్ 27న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని వైమానిక దాడిలో హతమార్చింది. అంతకుముందు హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్లను హతం చేసింది. వీరిలో అత్యంత కీలకమైన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కర్కీ వంటి వారు ఉన్నారు. అయితే, నస్రల్లాకి బహిరంగ అంత్యక్రియలు నిర్వహించే వరకు అతడిని రహస్య ప్రదేశంలో తాత్కాలికంగా ఖననం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Iran: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం, ఇజ్రాయిల్‌పై ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ క్షిపణి దాడుల తర్వాత తొలిసారి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఉపన్యసించారు.
PM Modi: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని పిలిచి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తరువాత పెరిగిన శత్రుత్వాలపై హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో కూడిన కమిటీతో పాటు ప్రధాని చర్చించారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం అన్ని పార్టీలను కోరింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం…