Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది. హిజ్బుల్లాకు చెందిన ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఇజ్రాయిల్ ఆదివారం రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన సందర్భంలో ఈ డబ్బుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
READ ALSO: Japan: చేయని తప్పుకు 58 ఏళ్ల జైలు శిక్షఅనుభవించిన వ్యక్తి.. పోలీస్ చీఫ్ క్షమాపణలు
దీనిపై ఇజ్రాయిల్ సైన్య ప్రతినిధి డానియల్ హగారి మాట్లాడుతూ.. హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా బంకర్‌లో మిలియన్ డాలర్ల బంగారం, నగదు దొరికినట్లు చెప్పారు. ఈ బంకర్ లెబనాన్ రాజధాని బీరూట్ నడిబొడ్డున ఉన్న అల్ సహెల్ ఆస్పత్రి కింద ఉంది. ఇదే కాకుండా హిజ్బుల్లాకు ఆర్థిక సహకారం అందిస్తుందనే అనుమానంతో ఆర్థిక సంస్థ అల్-ఖర్డ్ అల్-హసన్ (AQAH) ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. అల్-ఖర్డ్ అల్-హసన్ 1980ల నుండి లెబనాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, బంగారం డిపాజిట్లకు బదులుగా లెబనీస్ పౌరులకు క్రెడిట్‌ని అందిస్తోంది.
ఇదిలా ఉంటే, హిజ్బుల్లాకు ఆర్థికవనరుల్ని సమకూర్చే యూనిట్ 4400 చీఫ్‌ని సిరియాలో హతమార్చింది ఇజ్రాయిల్. ఈ యూనిట్ ఇరాన్ నుంచి హిజ్బుల్లాకు ఫైనాన్షియల్ సాయం అందిస్తోంది. ప్రస్తుతం దానికి హెడ్‌లో ఇజ్రాయిల్ లేపేసింది. దీంతో భవిష్యత్తులో హిజ్బుల్లాకు ఆర్థిక పరంగా కష్టకాలం మొదలైనట్లే.