Israel: హసన్ నస్రల్లా వారసుడిని చంపేశాం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్ సైన్యం
- హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్..
- హషీమ్ సఫీద్దీన్‌ను చంపేసినట్లు ధృవీకరించిన ఇజ్రాయెల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Read Also: SSRMB 29 : మహేశ్ కోసం రాజమౌళి వేట మొదలైంది..
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
అయితే, సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి, జిహాద్ కౌన్సిల్లో సభ్యుడు హషీమ్ సఫద్దీన్ చనిపోయాడు. అతనితో పాటు హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీహుస్సేన్ హజిమా, ఇతర హెజ్‌బొల్లా కమాండర్లు మరణించినట్లు ధ్రువీకరించామని ఐడీఎఫ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ఈ దాడి జరిగిన సమయంలో హెజ్‌బొల్లాకు చెందిన 25 మందికి పైగా మిలిటెంట్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఏరియల్ ఇంటెలిజెన్స్ పేర్కొనింది.
Read Also: KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్ వాంగ్మూలం..
ఇక, లెబనాన్‌లోని దాహియాలో ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్ భేటీ నిర్వహించారనే.. పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్ అలీ హజిమాతో పాటు సఫీద్దీన్ చనిపోయారని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. అయితే ఈవిషయంపై హెజ్‌బొల్లా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, 2017లో హషీమ్ సఫీద్దీన్ ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా పగ్గాలను ఆయనకే అందించనున్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన మృతి చెందారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు