Israel - Hezbollah: ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్బొల్లా మంగళవారం రాకెట్లతో దాడికి దిగింది. ఇక, వాటిని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడగా.. ఒక రిజర్విస్టు సైనికుడు మరణించినట్లు వెల్లడించారు.
Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది.
హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ గా ఉన్న నయీమ్ ఖాసిమ్ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.
Israel strikes: లెబనాన్‌లోని బీరుట్లో ఉన్న హెజ్బొల్లా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బ తీయటమే టార్గెట్ గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తుంది. హెజ్బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్ వార్నింగ్ ఇచ్చింది.
Iran-Israel War : ఇజ్రాయెల్‌లోని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసాన్ని శనివారం డ్రోన్ లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Iran Supreme Leader: హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు.
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు.
హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన చేసింది.