Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
Iran Supreme Leader: హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు.
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు.
హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించింది. పాలస్తీనా కోసం చివరి వరకు పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ కీలక ప్రకటన చేసింది.
Yahya Sinwar: ఇజ్రాయిల్ మోస్ట్ వాంటెడ్ హమాస్ లీడర్, ఉగ్రసంస్థకు చీఫ్‌గా ఉన్న యాహ్యా సిన్వార్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సిన్వార్ గురించి గత దశాబ్ధ కాలం నుంచి ఇజ్రాయిల్ వెతుకుతోంది. అత్యంత రహస్యంగా గాజాలోని భూగర్భ టన్నెల్స్‌లో తన భార్య, పిల్లలతో నివాసం ఉండే సిన్వార్ చివరకు పిల్ల సైనికులు అంటే.. కేవలం ఇజ్రాయిల్ ఆర్మీలో 9 నెలల క్రితమే చేరిన 20…
హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తు్న్న ఇజ్రాయెల్ గురువారం మరో చరిత్ర సృష్టించింది. అగ్ర నాయకులందరినీ ఐడీఎఫ్ దళాలు అంతమొందించాయి. అయితే గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి సూత్రదారి యాహ్యా సిన్వార్ మాత్రం చేతికి చిక్కలేదు. అతగాడి కోసం ఐడీఎఫ్ దళాలు ఎంత వెతికినా దొరకలేదు.
Hamas New Chief: హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇందులో హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా తెర పైకి వచ్చింది.
Joe Biden: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు.
Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.