హిజ్బుల్లా, హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే ఆ రెండు గ్రూపులకు సంబంధించిన అగ్ర నేతలందరినీ ఐడీఎఫ్ హతమార్చింది. వాటి మూలాలే లేకుండా అంతమొందించాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగుతున్నాయి.
Gaza-Israel War: హమాస్, హెజ్బొల్లా గ్రూప్‌లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వాన్ని.. గాజా కీలక దస్త్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోంది. ప్రధాని సన్నిహితులే ఈ రహస్య సమాచారం లీక్ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దేశ భద్రతాపరమైన అత్యంత రహస్య సమాచారాన్ని పీఎంఓలో పనిచేస్తోన్న అధికారిక ప్రతినిధి ఎలిఫెల్డ్‌స్టెయిన్ చేరవేశారని పేర్కొన్నాయి. భద్రతా సంస్థల్లో పనిచేస్తోన్న మరో ముగ్గురికి కూడా దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. అయితే వారి పేర్లు మాత్రం…
US Air Force: అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు B-52 స్ట్రాటోఫొర్ట్రెస్లు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. యూఎస్ సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Israel–Hezbollah conflict: వైమానిక, భూతల దాడులతో హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది.
Israel–Hamas war: హమాస్ ఉగ్రవాద సంస్థలో మిగిలిన చివరి కీలక నేతను చంపేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కసబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొనింది.
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికగా యూఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్ కు తరలిస్తున్నట్లు పేర్కొంది.
Iran-Israel : ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులకు ప్రతి దాడి చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.
Iran-Israel: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఇరాన్ రెడీ అవుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. ఇరాక్ భూభాగం నుంచి ఇరాన్ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు.
హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిమ్ బుధవారం తొలి ప్రసంగం చేశారు. మంగళవారమే హసన్ నస్రల్లా వారసుడిగా ఎన్నికయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో కాల్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే నడుచుకుంటానని ప్రకటించారు.