Netanyahu: గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి తనపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌ను రక్షించకుండా తనను ఏ శక్తీ ఆపలేదని పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలువరించలేదని వెల్లడించారు. అలాగే, అన్ని మార్గాల్లోనూ తను పోరాటం చేస్తానని నెతన్యాహూ స్పష్టం చేశారు.
Read Also: Jasprit Bumrah: 10 ఏళ్ల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్!
దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. మానవాళికి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ప్రపంచ క్రిమినల్ న్యాయస్థానం.. మానవాళికే శత్రువుగా మారిందని విమర్శలు గుప్పించారు. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని, మాజీ రక్షణ మంత్రి గాల్లాంట్‌లపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా మండిపడింది. ఐసీసీ నిర్ణయాన్ని తాము తిరస్కరిస్తున్నట్లు వైట్ హౌస్ తేల్చి చెప్పింది.