Israel–Hezbollah conflict: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత రోజే ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడికి పాల్పడ్డాయి. రాకెట్ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గమనించే తాము దాడి చేసినట్లు టెల్ అవీవ్ పేర్కొనింది. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో మంగళవారం నాడు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. కానీ, బుధవారం ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే, హెజ్‌బొల్లాయే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది.
Read Also: Sambhal Violence: సంభాల్ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
అయితే, లెబనాన్ పై జరిగిన వైమానిక దాడిలో నష్టం వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో స్వస్థలాలను వదిలి వెళ్లిన పౌరులు తిరిగి దక్షిణ లెబనాన్‌కు భారీస్థాయిలో తరలి వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో కొందరు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్తున్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. అలా ప్రవేశించిన వారిపై కాల్పులకు దిగినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల్లో ఇద్దరికి గాయపడినట్లు లెబనాన్ అధికారులు చెప్పుకొచ్చారు. తమ బలగాలు ఇంకా దక్షిణ లెబనాన్‌లో ఉన్నాయి.. అప్పుడే ఎవరూ సరిహద్దు గ్రామాలకు వెళ్లొద్దని ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది.
Read Also: Off The Record: బూడిద నుంచి బంగారం పిండుకోవడానికి మొదలైన రాజకీయ రచ్చ?
ఇక, కయామ్ పట్టణంలో తమపై ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్సెస్ కాల్పులు జరిపింది.. గాయాలు పాలయ్యామని ముగ్గురు జర్నలిస్టులు తెలిపారు. ఈ కాల్పుల సంఘటనల నేపథ్యంలో తమ పౌరులను లెబనాన్ అధికారులు అలర్ట్ చేశారు. సరిహద్దు గ్రామాల ప్రజలు నియంత్రణ పాటించాలన్నారు. ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తైన తర్వాతే సరిహద్దు గ్రామాలకు రావాలని చెప్పుకొచ్చింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కొనసాగిస్తునే ఉంది. రెండు పాఠశాలలపై దాడులకు పాల్పడింది. 11 మంది చనిపోగా.. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. హమాస్ మిలిటెంట్లపైనే తాము దాడి చేశామని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.