పశ్చియాసియాకు మంచి రోజులు రాబోతున్నాయి. గత కొద్ది రోజులుగా బాంబుల మోతలు, రాకెట్ల దాడులతో యుద్ధ భూమి దద్దరిల్లింది. రక్తం ఏరులైపారింది. ఆస్తులు నేలమట్టం అయ్యాయి. సర్వం కోల్పోయి ప్రజలు దిక్కులేనివారయ్యారు. ఈ మారణహోమాన్ని మరింత సాగదీయకుండా ముగింపు పలకాలని నిర్ణయానికి వచ్చాయి. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య సంధి కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..
హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్- హెజ్బుల్లా మధ్య గతకొద్దిరోజులుగా పరస్పర దాడులు జరుగుతున్నాయి. అయితే ఇటీవల యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ లెబనాన్‌లో పర్యటించారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరిపారు. లెబనాన్ పర్యటన తర్వాత ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఇరుదేశాలతో చర్చించి యుద్ధానికి ముగింపు పలకాలని భావించారు. ఇరుపక్షాలతో చర్చలు జరిపారు. చివరికి ఈ చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao : ఖమ్మం నలుదిక్కులా మొక్కలు కనిపించేలా అధికారులు కృషి చేయాలి
ఇదిలా ఉంటే ఆదివారం కూడా ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య వార్ ఉధృతం సాగింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హిజ్బుల్లా రెచ్చిపోయింది. ఆదివారం ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇరాన్ మద్దతుతో ఈ రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. కొన్ని టెల్ అవీవ్ ప్రాంతంలో పడగా.. మరికొన్నింటినీ ఐడీఎఫ్ దళాలు గగనతలంలో పేల్చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను హిజ్బుల్లా సోషల్ మీడియాలో వీడియోలు పంచుకుంది. ఇక ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటిపై క్షిపణి పడడంతో మంటల్లో కాలిపోయింది. మరొక క్షిపణి కారణంగా కార్లు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మొత్తానికి ఇరుపక్షాలు సంధికి రావడం శుభపరిణామం అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.