Israel-Lebanon War: కాల్పుల విరమణ నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
- ఇజ్రాయెల్.. లెబనాన్ మధ్య కాల్పుల విరమణ
- ఇరుదేశాల నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
- శాంతి.. సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్‌స్టాప్ పడింది. అటు అమెరికా.. ఇటు ఇజ్రాయెల్‌కు కూడా యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇజ్రాయెల్ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
ఇరు దేశాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో శాంతి నెలకొంటుందని.. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అభిప్రాయపడింది. ఇక ఇజ్రాయెల్‌లో భారతీయ పౌరులంతా క్షేమంగా ఉన్నారని.. వారితో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని శనివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: IND vs AUS 2nd test: అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్..!
ఇటీవల యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ లెబనాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపుపై చర్చించారు. అనంతరం అమోస్.. ఇజ్రాయెల్‌లో కూడా పర్యటించి ఇదే విషయంపై చర్చించారు. దీంతో రెండు దేశాలు యుద్ధం ముగింపునకు అంగీకారం తెలిపాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ కేబినెట్ కూడా తీర్మానం చేసింది. యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే లెబనాన్‌కు మీడియా ద్వారా వెల్లడించింది. యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణకు అంగీకారం తెల్పడంతో ఇజ్రాయెల్ దళాలు.. లెబనాన్ నుంచి వైదొలుగుతున్నాయి.
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు చేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి బందీలను విడిపించేందుకు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు చేశాయి. గాజా పట్టణాన్ని ధ్వంసం చేశాయి. అంతేకాకుండా హమాస్ అగ్ర నేతలందరినీ హతమార్చాయి. అనంతరం లెబనాన్‌లోని హిజ్బుల్లా దళాలు హమాస్ మద్దతుగా.. ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఐడీఎఫ్ దళాలు కూడా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై దాడి చేశాయి. ఇందులో భాగంగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చాయి. ఇలా హిజ్బుల్లా కమాండర్లను చంపుకుంటూ పోయాయి. అలాగే లెబనాన్‌లో ముఖ్య ప్రాంతాలను ధ్వంసం చేశాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముంగిపు పడింది.
ఇది కూడా చదవండి: ICC Test Ranking: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో నెంబర్-1 బౌలర్ మనోడే..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?