గత ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచిన ఇరుజట్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ ను మంచి శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొహాలిలోని ముల్లన్ పూర్ లో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంటుంది. డిసెంబర్ 2022లో జరిగిన కారు…
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ-20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్ కోహ్లీ.. టీ-20 ఫార్మాట్‌లో ఇంత వరకూ 376 మ్యాచ్‌లు ఆడాడు కోహ్లీ.. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ – 2024 మూడవ గేమ్ హై-వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ముందుగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి మిచెల్ స్టార్క్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తలపడనున్నారు. ఇదివరకు ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు పెద్దగా లేవు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడంతో కోల్‌కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లు ఉంది. మునుపటి సీజన్ లో కోల్‌కతా…
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరగబోయే కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో కొన్ని గంటల సమయంలో మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ తో పాటు ఐపీఎల్ పై పలు వ్యాఖ్యలు చేశాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్. రూ. 20.5 కోట్ల భారీ ధరను పెట్టి పాట్ కమిన్స్ ను దక్కించుకుంది ఎస్…
ఐపీఎల్ సీజన్ 17 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ అంటే ఇష్టపడని ఎవరు ఉంటారు. అందులోనూ సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు పండగే. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ-చెన్నై మ్యాచ్ ను జియో సినిమాలో అత్యధికంగా 26 కోట్లకు మందిపైగా వీక్షించారు. మొదటి మ్యాచ్ లోనే ఇలా చూశారంటే.. ముందు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్…
ఐపీఎల్ 17వ సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ, ఇండియా నుంచి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలిచాడు. విదేశీ బ్యాటర్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో ట్రోఫీని అందుకోవడానికి 10 జట్ల మధ్య పోరాటం మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో అంచనాల పర్వం కూడా మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో పలువురు వెటరన్ క్రికెటర్లు కూడా అంచనాలు వేయడం ప్రారంభించారు.