IPL 2024 – PBKS vs DC: అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే.. మరి ఫలితం ఏమిటో..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శనను కనపరిచిన ఇరుజట్లు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ ను మంచి శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొహాలిలోని ముల్లన్ పూర్ లో కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి రిషబ్ పంత్ పైనే ఉంటుంది. డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డ తర్వాత బలమైన సంకల్పం కారణంతో అందులోంచి కోలుకొని దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి తిరిగి రాబోతున్నాడు.

Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఇక ఈ ఇరు జట్లు 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి పీబీకేఎస్, డీసీలు 32 సార్లు తలపడ్డాయి. అయితే ఇరు జట్లు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. కాకపోతే చివరి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఢిల్లీ పంజాబ్ పై ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్ నాయకత్వంలో , పంజాబ్ ఈ ఐపీల్ లో తమ అదృష్టాన్ని మార్చుకోవాలని అనుకుంటోంది. తొలి టైటిల్ కోసం పోటీపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధావన్ అనుభవం, దూకుడు బ్యాటింగ్ తో పాటు నాయకత్వ లక్షణాలతో పంజాబ్ ని విజయం వైపు నడిపించడంలో కీలక వ్యక్తిగా మారనున్నాడు.
Also Read: Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించాడు..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌గా ఆడేందుకు అనుమతి పొందాడు. గత సీజన్ లో, పంత్ లేకపోవడంతో, డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా సేవలందించారు. కాకపోతే చివరి సీజన్ లో ఏకంగా జట్టు 9వ స్థానంలో నిలిచింది. మ్యాచ్ కు ముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.., “ఈసారి ఐపీఎల్ కు ముందు పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేసి ఉండకపోవచ్చు. అతను అదే ఫాంను తిరిగి పొందాలని చూస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీం విషయానికి వస్తే..
Also Read: IPL 2024 – KKR vs SRH: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఇద్దరు ఆటగాళ్లు తలపడితే..?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, కుమార్ కుశాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!