కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై - ఆర్సీబీ తలపడుతున్నాయి. కాసపటి క్రితమే టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలించింది. మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
గంటల కొద్దీ నిరీక్షణ ముగిసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024 ఓపెనింగ్ సెర్మనీ) 17వ సీజన్ ప్రారంభమైంది. సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ తొలి మ్యాచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది.
ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభ వేళ.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని పతిరణ మేనేజర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్‌తో ఎంఎస్ ధోని మరోసారి క్రికెట్ మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఎంస్ ధోనీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఆర్సీబీతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఎంఎస్ ధోని మరోసారి అందరికీ షాకిస్తూ కెప్టెన్సీ నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మహి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎంఎస్ ధోనీ తన జీవితంలోని ప్రతి ప్రధాన నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ఈ పద్ధతిలోనే తీసుకున్నాడు.