ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరగబోయే కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో కొన్ని గంటల సమయంలో మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ తో పాటు ఐపీఎల్ పై పలు వ్యాఖ్యలు చేశాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్. రూ. 20.5 కోట్ల భారీ ధరను పెట్టి పాట్ కమిన్స్ ను దక్కించుకుంది ఎస్ ఆర్ హెచ్. మాత్రం స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.
అయితే మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ.. తాను ఐపీఎల్ కంటే ఈ రెండు నెలలపాటు ట్రావెలింగ్ చేయడమే తనకు కష్టమని తెలిపారు. తను ఇదివరకే టి20 కెప్టెన్సీ చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఐపిఎల్ లో మాత్రం శనివారం నాడు జరగబోయే మ్యాచ్ కు కొత్తగా సిద్ధంగా ఉన్నానని.. దేని సవాల్ దానిది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే టి20 మ్యాచ్లలో కేవలం నాలుగు ఓవర్లు వేయడం శరీరానికి పెద్ద పని కాదని., కాకపోతే ట్రావెలింగ్ తో తాము మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఐపీఎల్ లో భాగంగా ప్రతిసారి ఓ కొత్త జట్టుతో ఆడతామని అందుకు తాము ప్రతిసారి కొత్తగా సిద్ధం అవ్వాలని ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read: Moscow Attack : మాస్కో ఉగ్రదాడిపై 15రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చిన అమెరికా
ఐపీఎల్ లాంటి విషయాలు తమకు కొత్తవి కాదని ఇలాంటివి చాలానే చూసామని మా జట్టులో ఎక్స్పీరియన్స్ ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు. ఇది టి20 క్రికెట్ బ్యాటర్లు బౌలర్లను ఇష్టం వచ్చినట్టు ఆడతారని, కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తమకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి మ్యాచ్లను గెలవాలని పాట్ కమిన్స్ కామెంట్స్ తెలిపాడు. గత సంవత్సరం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ తన జట్టుకి గెలుపులో కీలకపాత్రను పోషించాడు పాట్ కమిన్స్. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్ఎచ్ యాజమాన్యం భారీ దారులను వెచ్చించి అతనిని తీసుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో బౌలింగ్ యూనిట్ ప్రకారంగా చూస్తే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో అతను బౌలింగ్ పంచుకోవాల్సి వస్తుంది. వీరిద్దరితో పాటు టీంలో నటరాజన్, జయదేవ్ కూడా లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ జరగబోతోంది.