ఐపీఎల్ – 2024 మూడవ గేమ్ హై-వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ముందుగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లైన కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి మిచెల్ స్టార్క్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తలపడనున్నారు. ఇదివరకు ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లకు అంత మంచి రికార్డులు పెద్దగా లేవు. గౌతమ్ గంభీర్ మెంటార్ గా, శ్రేయాస్ అయ్యర్ తిరిగి రావడంతో కోల్‌కతాకు కొత్త ఊపిరి వచ్చినట్లు ఉంది.
మునుపటి సీజన్ లో కోల్‌కతా తరపున ఆడని అయ్యర్ తాను నేటి మ్యాచ్ కు ఫిట్‌గా ఉన్నానని, ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే స్టార్క్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇక కోల్‌కతా టీంకి బిగ్ హిట్టర్లు రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ బలమైన టాప్ ఆర్డర్ ను ఆడించేందుకు కోల్‌కతా టీం మానేజ్మెంట్ సిద్ధమయ్యారు. ఇక టీం స్పిన్ ద్వయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు సన్ రైజర్స్ బ్యాటర్ లకు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Pat Cummins: ఐపీఎల్ కన్నా తనకి అదే కష్టమంటున్న ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్..!
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఆడినప్పుడు గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు ఇరుజట్లు 25 సార్లు తలపడ్డాయి. వీటిలో 16 మ్యాచ్ లలో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే జియో సినిమా యాప్ లేదా వెబ్ సైట్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక టీం ప్లేయస్ విషయానికి వస్తే..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, జయదేవ్ ఉనద్కత్, అన్మోల్‌ప్రీత్ సింగ్ , ఉపేంద్ర యాదవ్, మయాంక్ మార్కండే, ఝటవేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ మహరాజ్ సింగ్, నితీష్ రెడ్డి.
Also Read:Pat Cummins: ఐపీఎల్ కన్నా తనకి అదే కష్టమంటున్న ఎస్ఆర్హెచ్ కొత్త కెప్టెన్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: ఫిలిప్ సాల్ట్(కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, ముజీబ్ ఉర్ రహమాన్, అనుకుల్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, చేతన్ సకారియా, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా, దుష్మంత చమీరా, అంగ్క్రిష్ రఘువంశీ, సాకిబ్ హుస్సేన్, సుయాష్ శర్మ.