CSK vs RCB: ఐపీఎల్ సీజన్ 17 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్ రావత్(48), దినేష్ కార్తిక్(38), డుప్లెసిస్(35), కోహ్లీ(21) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు ముస్తాఫిజుర్ 4 వికెట్లతో చెలరేగాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్్(15), రచిన్ రవీంద్ర(37), అజింక్యా రహానే(27), డారెల్ మిచెల్(22), శివమ్ దూబే(34), జడేజా(25) పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్ లో సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ బౌలర్లు కేమెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. కరణ్ శర్మ, యశ్ దయాల్ కు తలో వికెట్ దక్కింది. ఇక రేపు(శనివారం) మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు సన్ రైజర్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.