మూడో రోజైన నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నీలో 2 మ్యాచ్ లు జరగనున్నాయి. వీకెండ్ కారణంగా డబుల్ హెడర్ ధమాకా ఉండనుంది. నేడు జరిగే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడున్నాయి. ఇక రాత్రి జరగనున్న గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడున్నాయి. ఈ మ్యాచ్ పై అభిమానులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల వివరాలు చూస్తే.. ఐపీఎల్ 2024 సీజన్…
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లకు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) శనివారం ప్రకటించింది. ఫ్రాంచైజీ యాజమాన్యం చుట్టూ పెరుగుతున్న నిరీక్షణల మధ్య ఈ వార్త వచ్చింది. వైజాగ్ లో జరగబోతున్న మ్యాచ్ లకి సంబంధించి క్రికెట్ అభిమానులు రెండు మ్యాచ్ ల కోసం కోసం టికెట్స్ పొందవచ్చు. ఇందులో మొదటగా ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో…
ఐపీఎల్ – 2024 సీజన్ ను పంజాబ్ కింగ్స్ గెలుపుతో ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 3 : 30 కుజరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఆడిన సంచలన బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా…
ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు ఉత్కంఠగా సాగింది. ఉత్కంఠపోరులో కోల్ కతా గెలుపొందింది. 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో క్లాసెన్ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో సన్ రైజర్స్ గెలుస్తుందని అనుకుంటే.. హర్షిత్ రాణా వేసిన బౌలింగ్ లో కీలక క్లాసెన్ (63) వికెట్ తీశాడు. అంతకుముందు షాబాజ్ అహ్మద్ ను ఔట్ చేశాడు. చివరి బంతికి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ…
ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. మరికాసేపట్లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కమిన్స్ బరిలోకి దిగుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శనివారం రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్-ఢిల్లీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్…
ఐపీఎల్ సీజన్ 17లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లోనే తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. అది కూడా.. కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో మ్యాచ్ విన్ అయ్యారు. ఈ సీజన్ లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు గైక్వాడ్ చేపట్టారు. ఇకపోతే.. కెప్టెన్ గా రుతురాజ్ వ్యవహరించడమే కానీ, మ్యాచ్ లో మొత్తం సూచనలిచ్చేది మాత్రం ధోని అనే చెప్పాలి. ఎందుకంటే.. అతనికి కెప్టెన్ గా చేసిన అనుభవం…
ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 17వ సీజన్ ఎట్టకేలకి మొదలైంది. శుక్రవారం మొదలైన ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తఫిజూర్ రెహమాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.…