IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో ట్రోఫీని అందుకోవడానికి 10 జట్ల మధ్య పోరాటం మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో అంచనాల పర్వం కూడా మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో పలువురు వెటరన్ క్రికెటర్లు కూడా అంచనాలు వేయడం ప్రారంభించారు. వీరేంద్ర సెహ్వాగ్, స్టీవ్ స్మిత్ సహా ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఇప్పటికే ప్లేఆఫ్‌కు చేరుకునే నాలుగు జట్ల పేర్లను అంచనా వేశారు.
మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ప్లేఆఫ్‌లకు చేరుకోగల నాలుగు జట్లను పేర్కొన్నాడు. వీరూ ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై పందెం కాశారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు.. స్టీవ్ స్మిత్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను నాలుగు జట్లుగా ఎంచుకున్నాడు.
మెక్‌గ్రాత్-పార్థివ్ అంచనా ఏంటంటే?
పార్థివ్ పటేల్ ప్రకారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు IPL 2024 ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో విజయవంతమవుతాయి. అదే సమయంలో గ్లెన్ మెక్‌గ్రాత్ కేవలం రెండు జట్లపై మాత్రమే తన పందెం వేసుకున్నాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎంచుకున్నాడు. టామ్ మూడీ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్‌లను తన నాలుగు ఇష్టమైన జట్లుగా ఎంచుకున్నాడు.
10 జట్లు పాల్గొంటున్నాయి..
ఐపీఎల్ 2024లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు షెడ్యూల్‌ను బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంతలోనే లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించబడ్డాయి. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బోర్డు త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.