ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (45) పరుగులతో రాణించాడు. చివరలో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోరు అందించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలుపొందింది. 20 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్ సూపర్ విక్టరీ సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని లక్నో ముందు ఉంచిన రాజస్థాన్.. 173 పరుగులకే కట్టడి చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యా్చ్ ప్రారంభం కానుంది. ఈసారి ముంబై జట్టు కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యాతో బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.. ఆ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల కానుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
శనివారం రాత్రి జరిగిన కోల్కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో విజయం కోల్కత్తా నైట్ రైడర్స్ వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను గెలిపించడానికి కారణమయ్యాడు. చివరి ఓవర్లో 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్ జట్టుకు అవసరమవ్వగా దానిని డిపెండ్ చేసి…
ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ లు, వన్డేలకు అలవాటు పడిన సమయంలో క్రికెట్ కు మరింత క్రేజీ తీసుకొచ్చి మార్గంలో టీ20 ఫార్మేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా 20 ఓవర్ల మ్యాచ్ మొదలైన తర్వాత బిసిసిఐ మొదలుపెట్టిన ఐపీఎల్ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ లో భాగంగా బీసీసీఐ కొత్త కొత్త రూల్స్…