ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63, సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3…
ఇటీవల అంబటి రాయుడు ‘ఇదే తన చివరి టీ20 లీగ్’ అంటూ ట్వీట్ చేసినట్టే చేసి, ఆ వెంటనే దాన్ని డిలీట్ చేసిన వ్యవహారంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అసలెందుకు రాయుడు ఆ పని చేశాడంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు లేకపోవడంతో.. చెన్నై యాజమాన్యానికి, రాయుడుకి ఏమైనా చెడిందా? అనే అనుమానాలు తీవ్రమయ్యాయి. అలాంటిదేమీ లేదని, రాయుడు రిటైర్మెంట్ తీసుకోవడం లేదని సీఎక్కే సీఈవో కాశీ విశ్వనాథ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. అయితే నేడు ముంబాయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. పంజాబ్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటి…
తమ కోల్‌కతా టీమ్ సెలక్షన్ విషయంలో సీఈవో కూడా జోక్యం చేసుకుంటాడని గత వారం శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జట్టు ఎంపిక విషయంలో సీఈవో జోక్యం చేసుకోవడం ఏంటి? అసలు శ్రేయాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. రానురాను ఇది చినికి చినికి గాలివానగా మారడం మొదలయ్యింది. దీంతో, శ్రేయాస్ అయ్యర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘గత మ్యాచ్‌లో సీఈవో ప్రస్తావన తీసుకురావడం వెనుక అసలు…
ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ కోసం వివిధ జట్ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఆదివారం సందర్భంగా ఈరోజు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నోపై అద్భుత విజయంతో గుజరాత్ అందరికన్నా ముందు ప్లే…
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విలియమ్సన్ సేన ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఐదు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. ఆండీ రసెల్, శామ్ బిల్లింగ్స్ అదరగొట్టడంతో 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. Symonds: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. సైమండ్స్ కన్నుమూత అనంతరం 178 పరుగుల…
ఆంధ్రా క్రికెటర్, చెన్నై జట్టులోని టాప్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు ఈరోజు (మే 14) మధ్యాహ్నం ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. ఇదే తనకి ఆఖరి ఐపీఎల్ సీజన్ అని, వచ్చే ఏడాది నుంచి తాను ఆడనని అందులో పేర్కొన్నాడు. 13 సంవత్సరాలపాటు సాగిన తన ఐపీఎల్ జర్నీలో.. తనకు ఆడేందుకు అవకాశాలిచ్చిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఆ రెండు గొప్ప జట్ల తరఫున ఆడిన తాను.. ఆ కాలాన్ని…
ఆర్సీపీపై పంజాబ్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేక చతికిలపడింది. శుక్రవారం ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందు ఉంచింది. కాగా భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్క ప్లేయర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ స్థానంలో స్పిన్నర్ హర్‌ప్రీత్ బరార్ జట్టులోకి తీసుకుంటున్నట్లు మార్పు చేసినట్లు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపారు.…
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్లే ఆఫ్స్ రేసు ద్వారాలు మూసుకుపోయాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత ముంబై ఇండియన్స్ బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.…