డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ప్లే ఆఫ్స్ రేసు ద్వారాలు మూసుకుపోయాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత ముంబై ఇండియన్స్ బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే కుప్పకూలిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగులోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా ముంబై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
Sunil Gavaskar: అతడు ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండాలి
98 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలో ముంబై ఇండియన్స్ పేలవంగా ఆడింది. ఇషాన్ కిషన్ (6), కెప్టెన్ రోహిత్ శర్మ (18), డేనియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) వెంట వెంటనే అవుటయ్యారు. దీంతో చెన్నై తరహాలో ముంబై కూడా కుప్పకూలుతుందా అనిపించింది. అయితే తిలక్ వర్మ (34 నాటౌట్), టిమ్ డేవిడ్ (16 నాటౌట్) ముంబై జట్టును గెలిపించారు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరికి మూడు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించినా పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉంది. ఓడిపోయిన చెన్నై జట్టు స్థానం కూడా మారలేదు. ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్ కాగా ఇప్పుడు చెన్నైని కూడా తనతోపాటు తీసుకెళ్లింది.