ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ కోసం వివిధ జట్ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఆదివారం సందర్భంగా ఈరోజు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నోపై అద్భుత విజయంతో గుజరాత్ అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అంబటి రాయుడు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నానని ట్వీట్ చేసి ఆ వెంటనే డిలీట్ చేశాడు. ఈ క్రమంలోనే అతను ఈ మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అటు గుజరాత్ జట్టు కూడా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. ప్లే ఆఫ్స్‌కు ముందు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో ఎన్టీవీ లైవ్ చర్చ ద్వారా తెలుసుకోండి. ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.