ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63, సర్ఫరాజ్ ఖాన్ 32, లలిత్ యాదవ్ 24 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రబాడ ఓ వికెట్ సాధించాడు. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరుజట్లకు ఇది చావో.. రేవో మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇరుజట్లకు ఇది కీలక మ్యాచ్ అనే చెప్పాలి.