ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎంత పేలవ ప్రదర్శన కనబర్చిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టు, మునెపెన్నడూ లేనంత దారుణంగా ఈ సీజన్‌లో రాణిస్తోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్ళందరూ దాదాపు విఫలమయ్యారు.. ఒక్కరు తప్ప! అతడే.. సూర్య కుమార్ యాదవ్. మొదట్నుంచి ముంబై జట్టులో ఇతనొక్కడే బాగా ఆడుతున్నాడు. చాలా కసితో ఆడుతున్న ఇతగాడు, జట్టులోనే అత్యంత కీలకమైన బ్యాట్మ్సన్. అలాంటి సూర్య కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ సీజన్…
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఆటగాడు హెట్‌మెయిర్ స్వదేశానికి పయనం అయ్యాడు. అతడి భార్య ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్ గయానాకు వెళ్లాడు. అయితే త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాను అత్యవసర పనిమీద తాను స్వదేశానికి వెళ్తున్నానని.. తన కిట్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూంలోనే ఉందని ఇన్‌స్టా్‌గ్రామ్ వేదికగా తెలియజేశాడు. కాగా ఈ…
ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే ఫోర్లు, సిక్సులతో డీవై పాటిల్ మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటివరకు 23 సార్లు 200 పస్ల్ స్కోర్లు…
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 91పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో ఢిల్లీ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. వార్నర్ (19), శ్రీకర్ భరత్ (8), మిచెల్…
సాధారణంగా క్రికెట్‌లో గోల్డెన్ డక్ అంటే అందరికీ తెలుసు.. కానీ డైమండ్ డక్ అంటే చాలా మందికి తెలియదు. అయితే ఆదివారం సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్ చూసిన వాళ్లకు డైమండ్ డక్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డైమండ్ డక్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైతే దానిని డైమండ్ డక్ అంటారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మతో సమన్వయ లోపం కారణంగా విలియమ్సన్ ఖాతా…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అతడు ఈ టోర్నీలో గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి. అయితే మరో ఓపెనర్ డుప్లెసిస్ మాత్రం మెరుపు వేగంతో ఆడాడు. 50…
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా వైరస్ కలకలం రేగింది. ఆ జట్టులోని ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా సోకడం ఇది రెండోసారి. గతంలో…
ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. పూణె వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా టీమ్ 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంద్రజిత్(0), ఫించ్(14), శ్రేయస్ అయ్యర్(6), నితీష్ రాణా(2), రింకూ సింగ్(6) విఫలమయ్యారు. ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుటయ్యాడు.…
పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో…
ఐపీఎల్‌లో శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 68 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ జాస్ బట్లర్(30) మంచి సహకారం అందించాడు.…