ఈ ఏడాది ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. ఎన్నో మెరుపులు మెరిపించాడు. చాలాసార్లు జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని రౌద్ర రూపం దాల్చి, మైదానంలో తాండవం చేస్తున్నాడు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. కార్తీక్‌ను తిరిగి టీమిండియాలో తీసుకోవాల్సిందిగా మద్దతులు లభిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను…
ఐపీఎల్‌లో బుధవారం రాత్రి రాజస్థా్న్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులు చేసింది. అనంతరం 161 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ డకౌట్‌గా వెనుతిరిగినా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో…
అసలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు నీరుగారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పక్కటెముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా ఛాతిపై గాయాలయ్యాయి. అందుకే, అతడు…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ‘మిస్టర్ 360’ ఏబీ డీ విలియర్స్‌కి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన హోమ్ టీమ్‌గానే ఆ జట్టుని గౌరవిస్తాడు. విరాట్ కోహ్లీతోనూ ఇతనికి మంచి అనుబంధం ఉంది. ఈ జోడీని చూసినప్పుడల్లా క్రికెట్ అభిమానులు మురిసిపోతుంటారు. కానీ, ఈ సీజన్ నుంచి మళ్ళీ ఏబీడీని చూడలేదమని, అతని 360 ఆటను చూడలేమని తెలిసి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీడీ..…
నిన్న (మే10) లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయంలో శుబ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఇతనొక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 69 పరుగులు చేసి, చివరివరకూ అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ఘకాలం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను అతడు అందుకున్నాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్…
ఐపీఎల్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరే చేసినా గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. 62 పరుగుల తేడాతో లక్నోపై ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 63 నాటౌట్, మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్…
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు.. బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ పటిష్టంగా రాణించిన ఈ జట్టు.. ఈసారి మాత్రం తడబడింది. ఓపెనర్ సాహా 5 (11) పరుగులకే వెను దిరగగా.. శుభ్మన్ గిల్ ఒక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్ళందరూ…
త్వరలో సౌతాఫ్రికాతో జరగపున్న సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని తొలగించనున్నారా? అంటే దాదాపు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడన్న విషయం అందరికీ తెలుసు. అతడు సెంచరీ చేసి రెండేళ్ళ పైనే అవుతోంది. అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు కానీ, వింటేజ్ కోహ్లీని తలపించే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. మూడుసార్లు గోల్డెన్ డక్ అవ్వడమే కాదు, ఏ…
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయస్ సంచలన విషయాలు బయటపెట్టాడు. తమ జట్టు ఎంపికలో కోచ్‌తో పాటు సీఈవో వెంకీ కూడా పాల్గొంటారంటూ వ్యాఖ్యానించాడు. 11 మంది సభ్యుల తుది జట్టులో నీకు చోటు లేదంటూ మరో ఆటగాడికి చెప్పడం ఎంతో కష్టంగా ఉంటుందన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు శ్రేయస్ అయ్యర్ గుర్తుచేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్…
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓ దశలో 200 స్కోరు చేసేలా కనిపించిన కోల్‌కతా తక్కువ పరుగులు చేసిందంటే దానికి కారణం బుమ్రా. అతడు 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఓ మెయిడిన్ సహా 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు.…