ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. శనివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో విలియమ్సన్ సేన ఓటమి పాలైంది. దీంతో వరుసగా ఐదు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. ఆండీ రసెల్, శామ్ బిల్లింగ్స్ అదరగొట్టడంతో 177 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Symonds: ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో విషాదం.. సైమండ్స్ కన్నుమూత
అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ, మార్‌క్రమ్ తప్ప ఎవరూ రాణించలేకపోయారు. బ్యాట్‌తో అదరగొట్టిన కోల్‌కతా ఆటగాడు ఆండీ రసెల్ బంతితోనూ మ్యాజిక్ చేశాడు. మూడు వికెట్లు తీసి హైదరాబాద్ పరాజయంలో కీలక పాత్ర పోషించాడు. టిమ్ సౌథీకి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రసెల్‌కే దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు లేకపోవడం గమనార్హం.